![]() |
![]() |
బిగ్ బాస్ సీజన్-9 మొదలై రెండు వారాలవుతుంది. ఇప్పటివరకు కామనర్స్ ఓనర్స్ గా.... సెలబ్రిటీలు టెనెంట్స్ గా ఉన్నారు. రాజభోగాలు అనుభవిస్తూనే ఓనర్స్ ఉండగా చాకిరి చెయ్యడానికే హౌస్ లోకి వెళ్లినట్లు అన్ని పనులు చేస్తూ టెనెంట్స్(సెలెబ్రిటీస్) కష్టపడుతున్నారు. ఏది తినాలన్న ఓనర్స్(కామనర్స్) పర్మిషన్ ఉండాల్సిందే .. ఇప్పటివరకు టెనెంట్స్ ని ఓనర్స్ పురుగుల్లా చూసారు. ఓనర్స్ ఏ విషయంలో క్లారిటీగా లేరు.. ఇక నాగార్జున తన ముందున్న బోర్డు పై కంటెస్టెంట్స్ ఫోటోస్ ఉంచాడు. ఎవరికి రంగు పడుద్దో చూద్దామని నాగార్జున అనగా కంటెస్టెంట్స్ అంతా టెన్షన్ ఫీల్ అయ్యారు.
ఈ వారంలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్ ఫోటోకి రంగు పూయలేదు. వరెస్ట్ పర్ఫామెన్స్ఇచ్చిన వాళ్ళకి రంగు పూసాడు. అయితే ఓనర్స్ లో అందరికి రంగు పడుద్ది.. టెనెంట్స్ లో ఒక్క రీతూకి తప్ప ఎవరి ఫోటోకి రంగు పడదు. దాంతో ఒనర్స్ కి గట్టిగానే క్లాస్ తీసుకున్న నాగార్జున.. వాళ్ళకి ఒక ట్విస్ట్ ఇచ్చాడు.
ఇక నుండి బిగ్ బాస్ రూల్ చేంజ్. ఇప్పటివరకు కామనర్స్ ఓనర్స్ గా సెలబ్రిటీలు టెనెంట్స్ గా ఉన్నారు.. కానీ ఇప్పుడు రివర్స్.. సెలబ్రిటీలు ఓనర్స్ గా.. కామనర్స్ రెంటర్స్ గా ఉంటారని ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు నాగార్జున. ఇక భరణి, రాము వాళ్ళు అడి గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళు ఓనర్స్ గానే ఉంటారని నాగార్జున చెప్తాడు. ఇకనుండి కామనర్స్ కి చుక్కలే.
![]() |
![]() |